మానవత్వం చాటుకున్న బీజేపీ నేత శ్రీనివాస్ గౌడ్!

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండ్రాపల్లి గ్రామం పార్టీ కార్యకర్త కేశబోయిన కృష్ణయ్య తల్లిగారు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారికి పదివేల రూపాయలు ఆర్థికం సహయం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.