మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి.. నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న ఉప పోరులో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కాషాయం నేతలు విజ్ఞప్తి చేశారు.
కాగా కేంద్రంలోని మోదీ సర్కార్ లక్షల సంఖ్యలో ఇళ్లు కట్టిస్తుంటే.. కేసిఆర్ కేంద్రం ఇచ్చిన డబ్బులను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పోశాడని ఆరోపించారు వివేక్ వెంకట స్వామి. కాళేశ్వరం పేరుతో కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు దోచుకున్నదని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేసిఆర్ కూతురు కవిత కు ఢిల్లీలో 800 ల లిక్కర్ దుకాణాలు ఉన్నాయన్నారు. బంగారు తెలంగాణ అని కేసిఆర్.. ప్రజలను మోసం చేశాడని వెంకట్ స్వామి ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కేసిఆర్ ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నాడని ఆరోపించారు ఎమ్మెల్యే రాజేందర్. గ్రామాలలో బెల్టు షాపులు పెట్టి ముప్పై యేండ్లకే యువత చావు కారణమవుతున్నాడని మండిపడ్డాడు. సంక్షేమ పథకాలకు 20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి.. తాగే లిక్కర్ పై ఏడాది కి 45వేల కోట్ల ఆదాయం పొందుతున్నాడన్నాని మండిపడ్డాడు. రైతుబంధు లబ్ధిదారులు బెంజికాలలో వచ్చే డబ్బులు తీసుకుపోతుంటే.. మరోవైపు కౌలు రైతుల ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి పెద్ద బందు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కేసీఆర్కు బానిసల వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని మూల్యం చెల్లించుకోక తప్పదని ఈటల హెచ్చరించారు.
మొత్తంమ్మీద బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసి.. ప్రధాన పోటీగా భావిస్తున్న టీఆర్ఎస్ పై విమర్శల దాడి మొదలెట్టారు. తగ్గేదేలో తరహాలో చేరికలను వేగవంతం చేశారు.