జ్యేష్ఠ బహుళ ‘ఏకాదశి’
ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు.. “ఓ జనార్ధనా! జ్యేష్ఠ బహుళ ఏకాదశి కథను, వ్రతవిధానం గురించి తెలుపగలరు” అని ప్రార్థించాడు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు.. “ధర్మరాజా! జ్యేష్ఠ బహుళ ఏకాదశికి ‘యోగినీ ఏకాదశి’ అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి. ఈ లోకంలో భోగములను ప్రసాదించి, పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుందీ వ్రతం. పురాణ కథ: వ్రత కథ స్వర్గ ధామమైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తుండేవాడు. గొప్ప శివభక్తుడు….