Jandhyala : “జంధ్యాల” కు నవ్వించడమేకాదు.. గుండెను మెలిపెట్టడమూ తెలుసు..!
విశీ(వి.సాయివంశీ) : జంధ్యాల గారంటే కామెడీకి ట్రేడ్ మార్క్ అంటారు కానీ, తెలుగు సినిమాల్లో ఆయనలా సెంటిమెంట్ సీన్లు రాయగలిగిన మరో రచయిత కనిపించడు. నవ్వులు కురిపించడమే కాదు, గుండెను మెలిపెట్టడమూ తెలిసిన రచయిత ఆయన. నిజం! ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘ఆపద్బాంధవుడు’, ‘అబ్బాయిగారు’.. చెప్తూ పోతే బోలెడు. ‘అహ నా పెళ్లంట’ లాంటి క్లాసిక్ కామెడీ ఫిల్మ్లో కూడా రాజేంద్రప్రసాద్, నూతన్ప్రసాద్ల మధ్య తండ్రీకొడుకుల సెంటిమెంట్ను అద్భుతంగా పండించారు. ‘ష్.. గప్చుప్’ అని జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన…