Entertainment
MitrMyfriend: పిల్లలు ఎదిగే వేళ.. తల్లులు ఒంటరిగా మిగిలే వేళ..!
విశీ: బిడ్డ పుట్టగానే స్త్రీ తల్లి అవుతుంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. బాల్యం దాటి, యవ్వనంలోకి అడుగుపెట్టి, ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటూ ముందుకు సాగి, ఇంకా ఇంకా మరెన్నో సాధించాలనే తపనతో ఉన్నప్పుడు తల్లులు ఇంకా తల్లులుగానే ఉంటారు. తల్లితనాన్నే ఆస్వాదిస్తూ, ఒకానొక దశ తర్వాత ఆ తల్లితనంలోనే చిక్కుకుపోతుంటారు. రాముడు అంతఃపురం దాటి, మిథిల చేరి, ఆపై అడవులకు వెళ్ళి, రావణ సంహారం చేసినా అతను కౌసల్య తనయుడే! రాజమాత అక్కడే మిగిలింది. అక్కడే…
childtrafficking: పసిచెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ..!
విశీ: పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్‌నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది….
kanguva: రివ్యూ: కంగువా “బాహుబలి” ని బీట్ చేసిందా..?
Kanguvareview: విలక్షణ నటుడు సూర్య(suriya) తాజాగా నటించిన చిత్రం కంగువా( kanguva). హాట్ బ్యూటీ దిశా పటాని( Dishapatani )హీరోయిన్గా నటించిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ కి బాహుబలి.. కోలీవుడ్ కి కంగువా అంటూ చిత్ర బృందం ప్రచారం చేయడంతో సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. సూర్య కెరియర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ: ఫ్రాన్సిస్…
chandramohan: చంద్రమోహన్‌లా వచ్చారు.. చంద్రమోహన్‌లా వెళ్లిపోయారు..!
విశీ: అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలేటి విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో…
ManojBajpai: బాలీవుడ్ అంటే ఖాన్, కపూరులే కాదు.. మనోజ్ లాంటి విలక్షణ నటులూ ఉన్నారు..!
Bollywood : ‘The Family Man’ వెబ్ సిరీస్ గురించి సాయి వంశీ విశ్లేషణ . కథ, కథనం.. వీటన్నింటినీ మించి మనోజ్ బాజ్‌పేయి నటన చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 58 ఏళ్లు ఆయనకు. శ్రీకాంత్ తివారీ అనే పాత్రలో ఎంత బాగా నటించారంటే, తెరపై ఆయన ఉన్న ప్రతి సన్నివేశం చూసినకొద్దీ చూడాలని అనిపిస్తుంది. బిహార్‌లో బేల్వా అనే మారుమూల గ్రామంలో పుట్టి, National School of Dramaలో చేరడానికి మూడు సార్లు ప్రయత్నించి,…
Nikhil Siddharth: మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టినట్టేనా..?
Nikhil Siddharth: కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్ అప్పుడు ఇప్పుడో ఎప్పుడో అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: కథలోకి వస్తే…..
subhalagnam: భార్యకు మరో భర్త దొరికితే?మరో శుభలగ్నం..!
విశీ: భర్తకు మరో భార్య దొరికితే ‘శుభలగ్నం’.. మరి భార్యకు మరో భర్త దొరికితే? చిన్నప్పుడు తెలియలేదు కానీ, కాస్త ఎదిగి సాహిత్యాన్ని, సమాజాన్నీ అంతో ఇంతో చదివిన తర్వాత మరోసారి ‘శుభలగ్నం’ సినిమా చూశాను. విషయం అర్థమైంది. డబ్బు కోసం భార్య తన భర్తకు విడాకులిచ్చి మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది. లాభం రూ.కోటి. ఈ కథంతా మనకు తెలిసిందే! ఒకవేళ అదే పరిస్థితిలో భర్త ఉండి, భార్యను మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తానంటే ఆ…
Jitendereview: మూవీ రివ్యూ.. జితేందర్ రెడ్డికి సెల్యూట్..!
JitenderReddymovie:దేశ భక్తి, సాయుధ పోరాటం, విప్లవ వీరులు గురించి అనేక బయోపిక్ లు వచ్చాయి. తాజాగా తెలంగాణ జగిత్యాలకు చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: 1980 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జగిత్యాల జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ ఇది.వామపక్షాలు బలంగా ఉన్న కాలంలో నక్సలైట్లకు, ఆర్ఎస్ఎస్ కు మధ్య…
childmarriage: 14 ఏళ్ల పిల్లకు పెళ్లి.. ఒక యువతి దుఃఖ పాఠం..!
విశీ: తెలుగు నేల మీద ఒకానొక కాలం. మనవాళ్లకు పెళ్లికి పిల్ల దొరక్క కేరళ వెళ్లి డబ్బులిచ్చి అమ్మాయిల్ని కొనుక్కునేవారు. ఐదేళ్లు, ఆరేళ్ల పిల్లల్ని ముక్కుకు తాడుకట్టినట్టు మెడకు తాళి కట్టి మలబారు తీరం నుంచి తెలుగు నేలకి లాక్కొచ్చేవారు. అక్కడితో సొంతవాళ్లకూ, ఆ పిల్లకూ సంబంధాలు తెగినట్టే! ఎక్కడి కేరళ, ఎక్కడి ఆంధ్ర? ఆడవాళ్ల పేగుల నిండా ఎంత విషాదం? ఈ అంశంపై రచయిత పిశుపాటి నరసింహం గారు ‘తెగిన పేగు’ అనే కథ రాశారు….