జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
వైకాపా నేతల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవని హెచ్చరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నారు. నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు..అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…