BJPTELANGANA: ‘వొళ్లంచితేనే కల ఫలించేది’..!
BJPTELANGANA: ‘‘అండగా ఉండేందుకు ప్రజల వద్దకు కాక…. మీరెక్కడికి వెళ్లారో నాకు తెలుసు! ముఖ్యమంత్రిగా ధరించే కొత్త వస్త్రాలు కుట్టించుకునేందుకు ముందే పోటీలు పడి టైలర్ దగ్గరికి వెళ్లారు….’’ అని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ మందలించే స్థితి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు తెచ్చుకున్నారు? ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టు రాష్ట్ర నాయకుల అనైక్యత వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన ఫలితం దక్కలేదని కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. వారికా మేర సమాచారముంది….