Telangana: కేసీఆర్ ఫోటోతో జనంలోకి కవిత..!
హైదరాబాద్: తెలంగాణ జాగృతి పేరిట కవిత సరికొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో జాగృతి బలోపేతం తో పాటు ప్రజా సమస్యలే ఎజెండాగా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాహిత పథకాలను కేంద్రంగా చేసుకొని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను కవిత ఇప్పటికే సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా…