ఒంటరిగా విపక్షాలు బీజేపీని ఓడించేంత సీన్ లేదు..
” కాన్పు ఎప్పుడో తెలీదు, దేశంలో విపక్ష ఐక్యతకు పురుటినొప్పులొస్తున్నాయి. కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పోయి, రాజ్యాంగ భద్రతా దేశ రక్షణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనే నినాదం బలపడుతోంది. ప్రస్తుత అనైక్యతా పరిస్థితి ఇలాగే కొనసాగితే… విపక్షాల రాజకీయ మనుగడ ప్రమాదమని పార్టీలు ఒకటొకటిగా గ్రహిస్తున్నట్టుంది. అందుకే… నదులన్నీ సముద్రం వైపు సాగే తరహాలో ఐక్యతాయత్నాలు ఒక కేంద్రకం వైపు బలపడుతున్నాయి. అది ఓ కొలిక్కి రావటమన్నది కొన్ని పరిస్థితులు, పరిణామాలు, ఫలితాలపై ఆధారపడనుంది. కాంగ్రెస్…