ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్
Varahivijayayatra: ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…
