పవన్ ‘ వారాహి’ ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది: మనోహర్
వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు….
