చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్

చంపినా సరే…  చావడానికి రెడీ… కానీ కేసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో  ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్..కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కాంలో విచారణ చేసేందుకు కవిత ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ..ఆ ఇంటిని చూసి విస్తుపోయారని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యంత ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారన్నారు.రాష్ట్రంలో నోటిఫికేషన్లే తప్ప ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువకులు గల్ఫ్ కు పోయి అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా ఒట్టిమాటలేనని సంజయ్ కుండ బద్దలు కొట్టారు.

ఇక పాదయాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని మోహన్ రావు పేటలో గ్రామస్తులతో సంజయ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది స్థానిక గ్రామస్తులు తమ సమస్యలను సంజయ్ తో ఏకరవు పెట్టారు. ‘‘తమకు పెన్షన్లు రావడం లేదని.. ఇండ్లు లేవని..గుడిసెల్లో పండుకుంటే పాములు, తేళ్లు కుడుతున్నాయని.. మమ్మల్ని ఆదుకోవాలని’’ ఓ ముసలవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. తన భూమిని బలవంతంగా లాక్కున్నారని.. పోలీస్ స్టేషన్లో తిరిగినా…  న్యాయం జరగలేదని..ఎలాగైనాఆదుకోవాలిని ” ఓ బాధితురాలు వాపోయింది. అటు గల్ఫ్ వలసవెళ్లిన బాధిత కుటుంబ యువతి..  తన తండ్రి గల్ఫ్ లో చనిపోయారని.. ఇప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురాలేదని..  చాలా పేదోళ్ళమని.. మీరే న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. గ్రామస్తుల సమస్యలు, ఇబ్బందులను విన్న అనంతరం బండి సంజయ్ చేసిన మాట్లాడుతూ.. సంవత్సరం నుంచి ప్రజల బాగుకోసమే పాదయాత్ర చేస్తున్నానని..ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసమో రాలేదని స్పష్టం చేశారు.కేసీఆర్ పాలనలో… గల్ఫ్ బాధితుల సమస్యలు తీరలేదన్నారు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ శవాన్ని 6 నెలలైనా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు.తెలంగాణ ఉద్యమం లో దుబాయ్ వెళ్లిన వాళ్లు కూడా కేసీఆర్ కు పైసలు ఇచ్చారని.. అలాంటి వాళ్ళను కూడా ముండకొడుకులు అని తిట్టిన మూర్ఖుడు కేసిఆర్ అని మండిపడ్డారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి కొందరు దుబాయ్ లో సంవత్సరాలు తరబడి జైళ్ల లోనే మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో… గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి పాలసీ కూడా తీసుకురాలేదన్నారు. దుబాయ్ నుంచి తానే స్వయంగా.. 500 మంది శవాలను కేంద్రప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే ఏర్పాట్లు చేశానన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని. కార్మికులను ఆదుకుంటామని సంజయ్ స్పష్టం చేశారు.

 

Optimized by Optimole