రంగారెడ్డి: విద్యుత్ సమస్యకు అధికారుల తక్షణ స్పందనకు వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 269, 270, 271 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు సరైన ఎల్టీ సరఫరా లేకపోవడంతో, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నట్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ విషయంపై అసోసియేషన్ తరఫున ప్రతినిధులు చీఫ్ ఇంజనీర్ ఎల్. పాండ్యాని కలిసి సమస్యను వివరించారు. కాలనీలోని 6 చోట్ల ఉన్న సింగిల్ ఫేస్…
