BJPtelangana: తెలంగాణ బీజేపీకి వైరస్..!
BJPTELANGANA: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏదో వైరస్ సోకినట్టుంది. పాతాకొత్తనీటి కలయిక కుదురుకోవటం లేదు. పార్టీ మూలవాసులకు, వలసనేతలకు మధ్య సయోధ్యకు బదులు సంకులసమరమే సాగుతోంది. స్వార్థం, అలసత్వం, ముఠాతత్వం…. అంతటా ముప్పిరిగొంటున్నాయి. వ్యాధి సంస్థాగత ఎన్నికలకూ పాకి, ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతోంది. ముఠాతత్వం తారాస్థాయి చేరి, గ్రూప్ రాజకీయాలు ఊపందున్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా…. ప్రజాక్షేత్రంలో పార్టీ రోజురోజుకు వన్నె తగ్గుతోందే తప్ప పుంజుకోవటం లేదు. బీజేపీ సంస్థాగత ప్రగతి ‘ఒకడుగు…