karimnagar: ఫోన్ ట్యాపింగ్ తో కేసిఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారు: బండి సంజయ్
కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్ని ఊగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ పాలనలో అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయనీ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో స్వేచ్ఛను హరించారని” ఆయన ఆరోపించారు. సిరిసిల్లను కేంద్రంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కార్యచరణ సాగిందని బండి సంజయ్ తెలిపారు. “దీనికి వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అనేక మంది బాధితులు ఉసురు పోసుకున్నారు. ఈ…