లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

లైంగిక వేధింపులకి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016లో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో జస్టిస్ పుష్ప తీర్పును వెలువరిస్తూ..  ‘పోక్సో’చట్ట ప్రకారం శరీర భాగాలను దుస్తుల పై నుంచి తాకితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదని వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన వివరాల ప్రకారం ..  ఓ పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో తల్లి రావడం.. కేసు నమోదు కావడం జరిగింది. అతను దోషిగా తేలడంతో దిగువ కోర్టు నిందితుడికి మూడేళ్ళ శిక్ష విధించింది. నిందితుడు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు అప్పీల్ చేయగా, హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది.

కాగా బాంబే హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పొక్సో చట్టంపై సామాజిక మాధ్యమం వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టం వలన ఎందరో నిందితులు తప్పించుకునేందుకు ఆస్కారం ఉందని.. చట్టానికి సవరణలు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతూన్నారు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు నుంచి మాత్రం ఈఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.