Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2036 ఒలంపిక్స్ దృష్టిలో పెట్టుకొని సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని తెలిపారు. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండేదుకు సీఎం రేవంత్, మంత్రుల బృందం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ ను “స్పోర్ట్స్ హబ్”గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బడ్జెట్ లో క్రీడలకు 465 కోట్ల కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి కి నిదర్శమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ భారీగా నిధులు తీసుకొచ్చిన శాప్ చైర్మెన్ శివ సేన రెడ్డికి, కేటాయించిన సిఎం రేవంత్ గారికి అభినందనలు తెలిపారు.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

ఇక నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథిలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్,మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రపంచ బాక్సర్ నిఖత్ జరిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రికి కరాటే అసోసియేషన్ తరపున బ్లాక్ బెల్ట్ ప్రధానం చేశారు.

 

Optimized by Optimole