ఆర్టీసీ బస్సులో సీఎం ఆకస్మిక తనిఖీ..

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. శనివారం చెన్నైలోని కన్నకి నగర్ వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సులో ఆకస్మిక తనిఖీ నిర్వ‌హించారు. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి ప్ర‌జ‌లకు అందుతున్న సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులో అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు కార్య‌క్ర‌మం గురించి ఎలా భావిస్తున్నారని స్టాలిన్ మహిళా ప్రయాణికులను అడిగారు. బస్సుల్లో అదనపు సౌకర్యాలు అవసరమా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడుతూ నగరంలోని స్థానిక బస్సుల గురించి వారి అభిప్రాయాలను విన్నారు.

Optimized by Optimole