sambashiva Rao:
==============
Ali and Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై సీనియర్ కమెడీయాన్ అలీ (alia) మధ్య స్నేహం అందరికి తెలిసిందే. అయితే పాలిటిక్స్ కారణంగా వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి మిత్రులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. అలీకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చానని పవన్ అంటే..నువ్వు ఇండస్ట్రీలోకి రాకముందే సినిమాలు చేశానంటూ కౌంటర్ ఇచ్చారు. నీలా చిరంజీవి వేసిన బాటలో తాను సినిమాల్లోకి రాలేదని స్వయంకృషితో వచ్చానని కౌంటరిచ్చారు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది.
గత కొంత కాలంగా అలీకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. సినిమాల విషయంలో అలీకి సరైనా అవకాశం రాలేదు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌తో అయితే బాగుంటుందని అలీ కూడా భావిస్తున్నట్లు ఉన్నాడు.వీరి కాంబినేషన్ లో హిట్ పడితే అలీ మళ్లీ వెనక్కితిరిగి చూసుక్కర్లేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో మళ్లీ దగ్గరయ్యేందుకు అలీ ప్రయత్నాలు ప్రారంభించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలీ, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తామంటూ చెప్పుకొచ్చారు. తాను హోస్ట్‌గా చేస్తున్న ‘అలీతో సరదాగా’ షో కి త్వరలోనే పవన్ రాబోతున్నాడని బాంబ్ పేల్చాడు.. ఇప్పటికే ఈ షో కోసం పిలిచామని బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయినట్లు చెప్పుకొచ్చిన అలీ.. త్వరలోనే వస్తారని కూడా క్లారిటీ ఇచ్చాడు.
అలానే పవన్ కళ్యాణ్ చివరి రెండు సినిమాలు వకీల్‌సాబ్, భీమ్లా నాయక్‌లో సీరియస్ కథతో నడిచే కావడంతో కామెడీకి స్కోప్ లేకపోయింది. అందుకే తనకు నటించే అవకాశం రాలేదని చెప్పుకొచ్చాడు. పవన్ తర్వాత సినిమాల్లో కామెడీ రోల్ ఉంటే కచ్చితంగా తనకు పిలుపు వస్తుందన్నారు.
ఇటీవల అలీ సొంతగా తీసిన సినిమా ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. ఇక ఇటీవలే అలీకి ఏపీ ప్రభుత్వం గత వారం ‘ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు’’ పదవి ఇచ్చింది. ఒకవేళ వైసీపీ ఆదేశిస్తే 2024 ఎన్నికల్లో పోటీచేస్తానని కూడా అలీ చెప్పుకొచ్చాడు. పొలిటికల్‌గా అలీకి ఎట్టకేలకి ఒక గుర్తింపు వచ్చింది.