sambashiva Rao:
===========
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకుంది. ఆమె కూతురికి మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ విషయాన్ని రంభ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటోంది. అయితే తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమకి స్వల్ప గాయాలైయ్యాని వెల్లడించింది.
View this post on Instagram
కెనడా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం జరిగింది. రంభ రెండో కూతురు సాషాకి స్వల్ప గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని వెల్లడించింది. ప్రమాద సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలు, ఒక ఆయా కూడా ఉన్నారు. వాహనం ఢీ కొట్టిన తర్వాత కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.ప్రమాదం గురించి నటి పోస్ట్ చేసిన ఫొటోలు చూడగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రంభ చిన్న కూతురు త్వరగా కోలుకోవాలని అభిమానలు ప్రార్తిస్తున్నారు.