సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి ట్విట్టర్ బయో..!

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ట్విట్టర్ బయో కొత్త చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి  కామెంట్స్ కి  నిరసనగా.. కోమటిరెడ్డి ట్విట్టర్ బయోలో రాసుకున్న  కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  దీంతో రేవంత్ – కోమటిరెడ్డి వ్యవహారం  పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక  కోమటిరెడ్డి ట్విట్టర్ బయో చూసినట్లయితే..ఎంపి, మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేతో పాటు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌పార్టీకి హోంగార్డుగా సేవలందదిస్తున్నాను అంటూ రాసుకున్నారు. క్రమంలోనే ఆయన  ట్విట్టర్‌  బయో స్క్రీన్‌షాట్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆశ్చర్య పోవడం కోమటిరెడ్డి అభిమానుల వంతైంది. ఈ క్రమంలోనే మునుగోడు ప్రచారానికి సైతం తాను హాజరవడం లేదని కోమటి రెడ్డి కుండ బద్దలు కొట్టడం కొత్త చర్చకు తావిచ్చింది.

అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీడియో మెసేజ్ ద్వారా క్షమాపణలు చెప్పారు. అద్దంకి దయాకర్ సైతం కోమటిరెడ్డిని  మరోసారి వీడియో మెసేజ్ ద్వారా క్షమాపణలు కోరారు. అయినప్పటికీ వెంకట్ రెడ్డి అలక వీడనట్లు అతని ట్విట్టర్ బయో చూస్తే తెలుస్తుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది.