కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి?
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది.
వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
3 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలి
కోవిడ్ బారినపడి కోలుకున్నాక.. మూడు నెలల వరకు అప్రమత్తంగా ఉండాలి. యూరిక్‌ పంప్, యాక్టివ్‌ ఆర్‌ఓఎం ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలోని అన్నిభాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తం గడ్డ కట్టే ప్రమాదం తగ్గుతుంది.
ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవాలి..
కరోనా బారినపడి కొలుకున్ననాక.. తప్పనిసరిగా బ్రీతింగ్, స్పెరోమెట్రీ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతోపాటు ఇతర రుగ్మతలు తిరిగి దరిచేరవు. మానసిక ప్రశాంతత, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
ఆస్పత్రిలో చేరకున్నా ఫిజియోథెరపీ..
కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా..హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. ఫిజియోథెరపీ తీసుకోవడం మంచిది. శరీరం అలసిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే డయాఫ్రం, ఇతర కండరాలు బలహీనం అవుతాయి. వాటికి తిరిగి బలం చేకూర్చేందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నవారు మరింత బలహీనంగా అవుతారు. వారు మొదట కొద్దిరోజులు విశ్రాంతి..మంచి పోషకాహారం తీసుకోవాలి. తర్వాత ఫిజియోథెరపీ, వ్యాయామాలు మొదలుపెట్టాలి.

మరికొన్ని జాగ్రత్తలు..
_ మీరు కోవిడ్ సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చు. తద్వారా మీ శ్వాసప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.
_ కవాతు చేయడం వంటి వ్యాయామాలు కూడా మీరు అక్కడికక్కడే చేసుకోవచ్చు. ఉదా: మీరు మీ ఇంటి మెట్ల మీద ఒక మెట్లపైకి ఎక్కడం, కిందకి దిగడం (అవసరమైతే హ్యాండ్ రోల్ ను పట్టుకోవచ్చు). లేదా అరుబయట నడవడం లాంటి వ్యాయాయాలు చేయవచ్చు.

_ శక్తిని పెంచే వ్యాయామాలైన వాల్ పుషప్స్ చేయాలి.

_మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసిపోయినట్టు అనిపించకపోతే ఉదయం పూట కొన్ని నిమిషాలపాటు నడవడం మంచిది.