బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే నేతలు తృణముల్ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నట్లు షా వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంటే, దీదీ అల్లుడు శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. దీదీ హయాంలో, దోపిడీలు దొంగతనాలు అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు.

కాగా ఎన్నికల సమయానికి పార్టీ అంతా ఖాళీ అవుతుందని , దీదీ ఒక్కరే ఒంటరిగా మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది  బిజేపి ప్రభుత్వమేనని అమిత్ షా పునరుద్ఘాటించారు.