Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
తులసికీ ప్రదిక్షణం :
గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మ ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా!
ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మ! వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా!
రెండో ప్రదిక్షణం నీకిస్తినమ్మ! నిండైన సందలు నాకియ్యవమ్మా!
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా!
నాల్గో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! నవ ధాన్యా రాసులను నాకియ్యవమ్మా!
ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! ఆయువైదోతనం నాకియ్యవమ్మా!
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రున్ని నాకియ్యవమ్మా!
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా!
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! యమునిచే బాధలు తప్పించవమ్మా!
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! తోడుగా కన్యలకు తోడుయ్యవమ్మా!
పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా!