presidentelection2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించగా.. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదనను బలపరిచారు. ఇక నామినేషన్ కు ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్ ప్రాంగణంలోని అమరవీరుల విగ్రహాలకు నివాళులు అర్పించారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అనంతరం ముర్మ.. మద్దతూ కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఎన్సీపీ అధినేత శరద్ పవర్ లతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. అందుకు వారంతా ఆమెను అభినందనలు తెలిపారు.