‘షంషేరా’ ట్రైలర్ విడుదల.. భావోద్వాగానికి గురైన రణ్ బీర్!

ranbir kapoor

shamshera Trailer: బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ద్విపాత్రిభినయంలో నటిస్తున్న చిత్రం ‘షంషేరా’. వాణికపూర్ కథానాయిక. కరణ్ మల్హోత్రా దర్శకుడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ‘షంషేరా’ ట్రైలర్ నూ చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరో రణ్ బీర్ పాత్రతో పాటు.. ప్రతినాయకుడిగా నటిస్తున్న సంజయ్ దత్ డైలాగ్స్ .. పోరాట సన్నివేశాలు అభిమానులను అలరించేలా ఉన్నాయి.

ఇక షంషేరా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ ని తలుచుకుని భావోద్వాగానికి గురయ్యారు. ఈ సినిమా నాన్నగారు చూసి ఉంటే గర్వపడేవారని అన్నారు. నాపని తీరు గురించి నాన్న మోహంమాటం లేకుండా మొఖం మీదే చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు. ‘షంషేరా’ మూవీ చేసినందుకు సంతోషంగా ఉందని.. నాన్న ఎక్కడున్న ఆయన ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నట్లు రణ్ బీర్ తెలిపాడు.

Optimized by Optimole