Nalgonda: జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి: అపూర్వరావు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సామాజికభద్రతపై వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో ఎస్పీ అపూర్వరావు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత.. నేరరహిత నిర్మాణాంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి (సిసి కెమెరాల ఏర్పాటు) స్వచ్ఛదంగా వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు.అనేక రోడ్డు ప్రమాదాల కేసులలో సిసి కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.
అనంతరం రైస్ మిల్ యజమాని రాజేంద్ర ప్రసాద్ తనవంతుగా సిసి కెమెరాల ఏర్పాటు కొరకు లక్ష్య రూపాయల చెక్కును ఎస్పీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మిర్యాలగూడ వెంకటగిరి, సీఐ రాఘవేందర్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్. ఐ సంతోష్ వివిధ పరిశ్రమలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.మధు కుమార్, తదితరులు పాల్గొన్నారు.