ElonMusk:ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన – ‘ది అమెరికా పార్టీ’

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేతగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా రాజకీయ అరగ్రటం చేశారు. ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆయన పెట్టిన పేరు ‘ది అమెరికా పార్టీ’.

అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని, ప్రజలకు అసలు స్వేచ్ఛ లేదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం, వారి స్వేచ్ఛను రక్షించేందుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్క్ తెలిపారు.

ఇటీవలే మస్క్ఓ ప్రకటనలో, ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ కు అంగీకారం వచ్చిన తర్వాతనే కొత్త పార్టీని ప్రకటిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రకటన ప్రకారం, ఇప్పుడు పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తూ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.

ఎలాన్ మస్క్ నిర్ణయం అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపనుంది. ఇప్పటికే రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ ఎలా ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

Optimized by Optimole