మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన మూవీపై మెగా అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య డిజాస్టర్ తో నిరాశలో ఉన్న అభిమానులకు..ఈమూవీతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు మెగా బాస్. తాజాగా ఈచిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగుల మారతాయి.. నెక్ట్స్ సీఎం కుర్చీలో కూర్చునే వ్యక్తి .. అంటూ మాస్ డైరక్టర్ పూరిజగన్నాథ్ వాయిస్ తో విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా మళయాళంలో విజయవంతం చిత్రం లూసిఫర్ రిమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. దర్శకుడు మోహన్ రాజా తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు.పక్కా పోలిటికల్ యాక్షన్ గా రాబోతున్న మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటు నయనతార, సత్యదేవ్ , సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కోణిదేల ప్రోడక్షన్ పై హీరో రామ్ చరణ్ , ఆర్ .బి.చౌదరి, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా తెలుగు ,హిందీ భాషల్లో మూవీని నిర్మిస్తున్నారు.