బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..
ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతలు భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా బడా హీరోల సినిమాలను నెటిజన్స్ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మిష్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ బాయ్ కాట్ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. సినిమా ట్రైలర్ విడుదల నాటినుంచి విడుదల వరకు ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ హ్యష్ ట్యాగ్ వైరల్ కావడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. అమిర్ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా.. మూవీకి కలెక్షన్లు వచ్చాయి. మరో హీరో రణ్ బీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర మూవీకి సైతం ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా..బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ‘ పఠాన్ ‘ సినిమాను నెటిజన్స్ టార్గెట్ చేశారు. గతంలో చిత్ర హీరో, హీరోయిన్ చేసిన కామెంట్స్ కోట్ చేస్తూ ‘బాయ్ కాట్ పఠాన్ ‘ హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకునే .. CAA విషయంలో జేఎన్ యూ కు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ఆపదలో ఉంటే శత్రుదేశానికి ఆర్థిక సాయం చేసిన షారుఖ్.. దేశం ఆపత్కాలంలో ఉంటే స్పందించరూ అంటు కామెంట్స్ దాడి చేస్తున్నారు.బాయ్ కాట్ పఠాన్ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన పడుతున్నట్లు తెలిసింది. సినిమాపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు