జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల..

Janasena: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు  అన్నపరెడ్డి నాగశివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్  పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. పార్టీ తరఫున అన్ని విధాలా ఆ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ముగ్గురు క్రియాశీలక సభ్యులకు మెడిక్లయిమ్ చెక్కులు..

అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన మరో ముగ్గురు క్రియాశీలక సభ్యులకు మెడిక్లయిమ్ చెక్కులు  మనోహర్  అందచేశారు. తాడికొండ నియోజకవర్గం కొర్రపాడుకు చెందిన  హరిగోపాల్ కు రూ. 50 వేలు, గుంటూరు పట్టణానికి చెందిన దాసరి హరికృష్ణ బాబుకు రూ. 50 వేలు, రేపల్లె నియోజకవర్గం, పెనుమూడి గ్రామానికి చెందిన  ఆళ్ల నాగ శ్రీధర్ కు రూ. 25 వేల చెక్కులు ఇచ్చారు. ముగ్గురి ఆరోగ్యం గురించి ఆరా తీసిన మనోహర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మన్  చిల్లపల్లి శ్రీనివాస్, గుంటూరు నగర అధ్యక్షులు  నేరెళ్ల సురేష్, పార్టీ నేతలు బడే కోమలి, సామల నాగేశ్వరరావు, వాసా శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, మునగపాటి మారుతిరావు,  దాసరి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole