ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే హవా.. సర్వేలో వెల్లడి!

దేశంలో ఎన్నికల మిని సంగ్రామం మొదలైంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కమలం పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడైంది.
కాగా వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో కాషాయం పార్టీ ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో మరోమారు అధికారాన్ని చేపడుతుందని తేలింది. ఒక్క పంజాబ్‌ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని సర్వే ఫలితాలు. చెబుతున్నాయి.

కాగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మళ్లీ బీజేపీదే అధికారమని సర్వేలో స్పష్టమైంది. 403 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ను దాటి 227-254 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 136-151 స్థానాలు, బీఎస్పీకి 8-14, కాంగ్రె్‌సకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సింహభాగం ప్రజలు సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌కే జైకొట్టారని తెలిపింది. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా సమాజ్‌వాదీ వైపు మొగ్గుచూపుతున్నారని ఒపీనియన్‌ పోల్‌ స్పష్టం చేసింది.

అటు ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని పుష్కర్‌సింగ్‌ ధామీ సర్కారుకే ప్రజలు జైకొడుతున్నారని టైమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. ఆ పార్టీకి 44-50 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 12-15 సీట్లతో సరిపెట్టుకుంటుందని, అనూహ్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ కు 5-8 సీట్లు వస్తాయని తెలిపింది.

ఇక గోవాలో బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఉన్నా.. తిరిగి ఆ పార్టీకే పట్టం కడతారని ఒపీనియన్‌ పోల్‌ అంచనా వేసింది. గోవా వాసులు ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌కే జైకొట్టారని తెలిపింది. ఇక్కడ బీజేపీకి 17-21 సీట్లు వస్తాయని.. అనూహ్యంగా ఆప్‌కు 8-11 సీట్లతో విపక్ష స్థానం దక్కే అవకాశం ఉందని వివరించింది. కాంగ్రెస్‌ 4-6 స్థానాలతో సరిపెట్టుకోనుందని వెల్లడించింది.

Optimized by Optimole