పేద సివిల్స్ అభ్యర్థుల కోసం సోను స్కాలర్ షిప్!

నిరుపేద విద్యార్థులకు నటుడు సోనూసూద్ గుడ్న్యూస్ చెప్పారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్ సాదించాలన్న కోరిక ఉన్నవారి కోసం ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు
కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్పై ఆశ ఉన్నవారి కోసం సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. ‘సంభవం’ అనే ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉచిత స్కాలర్షిప్తో పాటు సివిల్స్లో ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గదర్శకత్వం పొందాలనుకునే వారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గలవారు స్కాలర్ షిప్ కోసం ఈక్రింది సైట్లో వివరాలు నమోదు చేసుకోగలరు.
soodcharityfoundation.org