జై జవాన్ జైకిసాన్ నినాద కర్త.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ జయంతి…!!

నిరాండబరుడు..నిగర్వి.. నిబద్దతకు మారుపేరు.. స్వాతంత్ర్య సమయయోధుడు .. జైజవాన్ జైకిసాన్ నినాదకర్త.. అసాధరణమైన సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి.. మృదుస్వభావి మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆమహానీయుడికి యావత్ భారతవాని నివాళి అర్పిస్తోంది.

లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 న ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. తల్లిదండ్రులు రాందులారి దేవి ,శారదప్రసాద్ శ్రీవాస్తవ. శాస్త్రి 1925 వారణాసి లో కాశీ విద్యాపీఠంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.అతని తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రెండో యేటనే తండ్రి మరణంతో శాస్త్రి కుటుంబం తాత హజారీలాల్ ఇంటికి మకాం మార్చింది.చిన్నతనం నుంచే లాల్ బహదూర్ ధైర్యం, సాహసం, నిస్వార్థత లక్షణాలను కల్గి ఉన్నాడు.మీర్జాపూర్ లో ప్రాథమిక విద్యాభాసం పూర్తవ్వగానే శాస్త్రి వారణాసికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే తన మామతో కలిసి ఉంటూ అతని చిన్న కుమార్తె లతితా దేవిని వివాహం చేసుకున్నాడు.వరకట్న వ్యవస్థ కు పూర్తి వ్యతిరేకమైన బహదూర్..మామ కోరిక మేరకు ఐదు గజాల ఖాదీ (కాటన్, సాధారణంగా హ్యాండ్‌స్పన్) వస్త్రాన్ని కట్నంగా అంగీకరించాడు. ఈ దంపతులకు ఆరుగురు సంతానం.

యుక్తవయసులో లాల్ బహదూర్ జాతీయ నాయకుల ప్రసంగాలతో ప్రేరణ పొంది.. జాతీయ వాద ఉద్యమంలో చురుగ్గాపాల్గొన్నాడు.అతను ఎక్కువగా మార్స్క్, రస్సెల్,లెనిన్ పుస్తకాలను చదువుతుండేవాడు.1921తో సహయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జైలుకెళ్లాడు. అతను అప్పటికి మైనర్ కావడంతో అధికారులు అతనిని విడిచిపెట్టారు.1930 లో శాస్త్రి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయ్యాడు.ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.ఇంటింటికి తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తూ కట్టవద్దని ప్రజలను అభ్యర్థించాడు.1937 తో ఉత్తరప్రదేశ్ నుంచి శాసన సభకు ఎన్నికయ్యాడు.

స్వాతంత్ర్యం అనంతరం లాల్ బహదూర్ వివిధ హోదాల్లో పనిచేశాడు.గోవింద్ వల్లభ్ పంత్ కేబినేట్ లో హోమంత్రిగా పనిచేశాడు.పోలీస్ వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశ పెట్టాడు. ఫలితంగా నెహ్రు హయంలో రైల్వే మంత్రి గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.1956 లో తమిళనాడు రైలు ప్రమాదంలో 150 మంది ప్రయాణికులు మరణించడంతో.. తన పదవికి రాజీనామా చేశాడు.మళ్లీ 1957 లో తిరిగి కేబినేట్ లో చేరాడు. 1961తో కేంద్ర హోమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

అనూహ్యంగా ప్రధాని పదవి..

మృదుస్వభావి అయిన లాల్ బహదూర్ నెహ్రు ఆకస్మిక మరణం తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే నిరుద్యోగం, ఆహారకొరత వంటి అనేక సమస్యలను శాస్త్రి చక్కబెట్టాడు.అంతేకాకుండా హరితవిప్లవాన్ని , శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.1962 చైనా దురాక్రమణ తర్వాత భద్రత బలాగాలకు శాస్త్రి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. 1965పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత ..శక్తివంతమైన దేశాన్ని నిర్మించడానికి స్వీయ-పోషణ , స్వావలంబన ఆవశ్యకతను తెలియజేస్తూ ‘జై జవాన్ జై కిసాన్‘ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు.

విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న శాస్త్రిని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. ఈక్రమంలోనే అతను రెండుసార్లు గుండెపోటుకు గురయ్యాడు. ఆకస్మాత్తుగా 1966 జనవరి 11న.. పాకిస్థాన్ తో తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన వెంటనే అతను గుండె పోటుతో మరణించారని అప్పటి అధికారులు ప్రకటించడంతో.. యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.మరోవైపు అతని భార్య లలితాదేవి .. శాస్త్రి పై విషప్రయోగం జరిగిందని..ప్రధానికి సపర్యలు చేసే రష్యాకు చెందిన బట్లర్ కారణమని ఆరోపించడంతో అతని అరెస్ట్ చేశారు. తర్వాత శాస్త్రి గుండె పోటు తో చనిపోయారని వైద్యులు ధృవీకరించడంతో అతనిని విడుదల చేశారు.

ఏదీ ఏమైనా తన నాయకత్వ పటిమతో దేశానికి సుపరిపాలన అందించిన  మహానాయకుడు లాల్ బహదూర్ మరణ మిస్టరీ ఇప్పటికి వీడకపోవడం..ఇప్పటికీ అతని అభిమానుల్ని కలిచి వేసే  విషయం.

Optimized by Optimole