మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతున్న బాయ్ కాట్ ఫీవర్ ..!!

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ను వెంటాడుతున్న బాయ్ కాట్ ఫీవర్ ..!!

మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. అనూహ్య రీతిలో సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మూవీ విడుదలకు మరో నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఆందోళనలో పడింది. దివంగత నటుడు సుశాంత్ మరణాంతరం మొదలైన బాయ్ కాట్ వివాదం బాలీవుడ్ నుంచి టర్న్ తీసుకుని టాలీవుడ్ కి పాకింది. ఇంతకు గాడ్ ఫాదర్ బాయ్ కాట్ పిలుపు కారణం ఏంటంటే ?

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బడా స్టార్లను టార్గెట్ చేసుకుని నెటిజన్స్ సోషల్ మీడియాలో బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.ముఖ్యంగా బడా నిర్మాత కరణ్ జోహర్ ప్రమేయం ఉన్న ప్రతిసినిమాను నెటిజన్స్ వదలడం లేదు. అటు సోషల్ మీడియాలో..ఇటు థియేటర్స్ దగ్గర సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో చూశాం.బాయ్ కాట్ దెబ్బకు అమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీస్ డిజాస్టర్లుగా మిగిలాయి. అమిర్ ఖాన్ సినీ చరిత్రలో మొదటిసారిగా 100 కోట్ల కలెక్ట్ చేయని మూవీగా లాల్ సింగ్ నిలిచిదంటే బాయ్ కాట్ ప్రభావం ఏమేర ఉందో అర్థం చేసుకోవచ్చు. రణ్ బీర్ కపూర్ విషయంలోనూ ఇదే తంతు జరగడం.. కరోనా తర్వాత ఏమూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.

ఇక బాయ్ కాట్ పిలుపుకు ప్రధానం కారణం.. గతంలో బాలీవుడ్ నటినటులు హిందువుల మనోభావాల దెబ్బతినేలా ప్రవర్తించడం. తర్వాత తప్పు తెలుసుకుని క్షమించమని అడిగిన ఫలితం లేకపోయింది. అగ్గికి ఆజ్యం పోసినట్లు అలియా భట్ , కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా బాయ్ కాట్ పిలుపుకు కారణమయ్యాయి. ఇక దివంగత నటుడు సుశాంత్ అభిమానులు చాన్స్ దొరికితే చాలు ప్రోడ్యూసర్ కరణ్ జోహార్ ను ఆటఆడేసుకుంటున్నారు. తమ హీరో ఆత్మహత్యకు నెపోటిజం కారణమని భావిస్తున్న అభిమానులు.. కరణ్ ని టార్గెట్ గా చేసుకుని బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

కాగా తాజాగా మెగాస్టార్ విషయంలోనూ ఇదే ట్రెండ్  కొనసాగుతోంది . బ్రహ్మాస్త్ర మూవీకి సపోర్ట్ చేస్తూ చిరు ప్రచారం చేయడం.. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ నటించడాన్ని సాకుగా చూపిస్తూ నెటిజన్స్  బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.ఇటు మెగా అభిమానులు బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కు ధీటుగా బదులిస్తున్నారు. తగ్గేదెలే తరహాలో రెండు వర్గాల మధ్య సోషల్ వార్ నడుస్తుండటంతో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.