Friendshipday2024:
” స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా..
కడదాకా నీడ లాగ నిను వీడి పొదురా..
నీగుండెలో పూచేటిది..
నీశ్వాసగ నిలిచేటిది..
ఈ స్నేహమొకటేనురా…”
అన్నాడో ఓసినిగేయ రచయిత. ప్రతి వ్యక్తి జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత నమ్మకంగా కడదాక తోడుండేది స్నేహితుడు మాత్రమే. అందుకే కాబోలు స్నేహం(Friendship) గొప్పతనాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని(Friendshipday) జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. రెండు సంఘటనలు ఒకేలా ఉన్నా.. మూలం, లక్ష్యాలు, సాంస్కృతిక చరిత్రలో తేడాల కారణంగా తేదీలు మారుతూ ఉంటాయి.
ఇద్దరూ ప్రాణస్నేహితుల గుర్తుగా…
1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజునఇద్దరూ ప్రాణస్నేహితుల్లో.. ఒకరూ అమెరికా ప్రభుత్వం చేతిలో మరణించాడు. ఈవిషయం తెలిసిన మరో స్నేహితుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దీనికి చలించినపోయిన అమెరికా ప్రభుత్వం ఇద్దరూ ప్రాణ స్నేహితుల గుర్తుగా జాతీయ స్నేహితుల రోజు(Friendshipday)ను ప్రకటించింది.
1950 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ కి చెందిన హాల్‌మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ ఆలోచన నుంచి పుట్టిందే స్నేహితుల దినోత్సవం(Friendshpday) . తదనంతర కాలంలో ఆలోచన కాస్త కార్యరూపం దాల్చడంతో పరాగ్వే లో 1958 జూలై 30 వ తేదిన ప్రపంచ స్నేహితుల దినోత్సవం(Friendshipday) జరుపుకోవాలని వరల్డ్ ఫ్రెండ్ షిప్ క్రూసేడ్ సంస్థ ప్రతిపాదించింది. అప్పటినుంచి చాలా దేశాలు ఈవేడుకను జరుపుకోవడం మొదలెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆరోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం(Friendshipday)గా ప్రకటించింది.