ప్రధాని మోదీ ఓచిన్నారి మధ్య సంభాషణ వీడియో వైరల్ గా మారింది. నేను ఎవరో తెలుసా? అంటూ మోదీ ప్రశ్నించగా.. బదులుగా చిన్నారి చెప్పిన సమాధానానికి ప్రధాని ఫిదా అయ్యారు. ఇంతకు ఆ చిన్నారి ఎవరూ? ప్రధాని మోదీని ఎందుకు కలిసింది? ఆపాప చెప్పిన సమాధానం ఏంటంటే?
आज का दिन अविस्मरणीय है।
विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से आज सपरिवार मिलने का सौभाग्य मिला, उनका आशीर्वाद और जनता की नि:स्वार्थ सेवा का मंत्र प्राप्त हुआ। pic.twitter.com/FYHY2SqgSp— Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022
పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా బీజేపీ ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా కుటుంబ సభ్యులతో కలిశారు.ఈసందర్భంగా ప్రధాని ఎంపీ కుమార్తె ఆహానా ఫిరోజియాను నేనెవరో తెలుసా ? అంటూ కుషల ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా చిన్నారి నవ్వుతూ ” మీరు ప్రధాని మోదీ.. నేను మిమ్మల్ని ప్రతిరోజు టీవీలో చూస్తుంటాను ” అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. చిన్నారి సమాధానికి ప్రధాని మోదీతో సహా ఆవరణలోని సభ్యులంతా నవ్వులు చిందించారు. అనంతరం చిన్నారికి ప్రధాని చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ప్రధానితో భేటికి సంబంధించిన ఫోటోలను ఎంపీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘నాకుటుంబంతో ప్రధాని మోదీ కలవడం.. ఆయన చూపించిన వాత్సల్యం జీవితంలో మరిచిపోలేనంటూ’ ట్విట్ చేశారు.