పాదయాత్రలో భట్టిపై గీత‌న్న‌ల మ‌మ‌కారం..

PeoplesMarch:   సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌య‌మంలో ఓ గీత కార్మికుడు భ‌ట్టి వ‌ద్ద‌కు వ‌చ్చి.. తాటి ముంజ‌లు తినిపించారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క న‌డుస్తూ వ‌స్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేష‌న్ కావాలి.. అప్ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు డా. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇచ్చిన ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ వ‌ల్ల ఎంద‌రో పేద బిడ్డ‌లు పెద్ద‌పెద్ద చ‌దువులు చ‌దువుకున్నారు. అలాగే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి.. ఆరోగ్య శ్రీ వ‌ల్ల  మాలాంటివాళ్లు ఎంద‌రో పెద్ద‌పెద్ద ద‌వాఖానాల్లో చూపించుకున్నాము.. అప్పుడు ఇచ్చింది మీరే కాబ‌ట్టి.. ఇప్పుడు మీరే వాటిని మ‌ళ్లీ ఇవ్వాల‌ని కోరారు. ఇక గౌడ్  మాట‌లకు స్పందించిన సీఎల్పీ నేత.. త‌ప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని మ‌ళ్లీ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి పాదయాత్రను కొనసాగించారు.

 (సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో దరువేసిన మాజీ పీసీసీ అధ్యక్ష్యుడు వీ హనుమంత రావు)

 

Related Articles

Latest Articles

Optimized by Optimole