స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

పండుగ సీజ‌న్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదు. ఆదివారం దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగ‌నట్లు క‌నిపిస్తుంది. ఇక ఈరోజు దేశంలో ప‌సిడి ధ‌ర‌లను చూస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం అదేమేర త‌గ్గి, 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. ఇక ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను గ‌మ‌నిస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 420 రూపాయ‌లుగా ఉంటే, 24 క్యారెట్ బంగారం ధ‌ర పెరిగి 49 వేల 550 రూపాయ‌లుగా ఉంది. అదే, హైద‌రాబాద్‌లో ప‌సిడి ధ‌రలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 110 రూపాయ‌లుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 49 వేల 210 రూపాయ‌లుగా ఉంది. ఇక‌, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం న‌గ‌రాల్లోనూ ఇవే ధ‌ర‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Optimized by Optimole