కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇంధనం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో నిన్నటిలాగానే లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయల 20 పైసలుంటే… డీజిల్ ధర 94 రూపాయల 62 పైసలుగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఉన్న ఇంధనం ధరలను చూస్తే… కరీంనగర్‌లో పెట్రోల్ నిన్నటి కంటే పైసా తగ్గి 108 రూపాయల 38 పైసలుగా ఉంటే.. డీజిల్ పైనా పైసా తగ్గి, 94 రూపాయల 78 పైసలుగా ఉంది. నిజామాబాద్‌లోనూ పెట్రోల్ నిన్న రూపాయి పెరిగి, ఈ రోజు ఒక రూపాయి 4 పైసలు తగ్గింది. ఈరోజు ఇక్కడ పెట్రోల్ 109 రూపాయల 51 పైసలుకు చేరుకుంటే, డీజిల్ ధరలో 2 పైసలు పెరిగి, 95 రూపాయల 83 పైసలుగా ఉంది. ఆదిలాబాద్‌లో పెట్రోల్ నిన్నటిలా 110 రూపాయల 41 పైసలుగా ఉంటే, డీజిల్ స్థిరంగా 96 రూపాయల 68 పైసలుగా ఉంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలను గమనిస్తే… ఈ రోజు విజయవాడలో లీటర్ పెట్రోల్ 83 పైసలు తగ్గి, 110 రూపాయల 15 పైసలుగా ఉంది. డీజిల్ ధర తగ్గి 96 రూపాయల 23 పైసలయ్యింది. గుంటూరులో పెట్రోల్ 110 రూపాయల 15 పైసలుంటే. డీజిల్ 96 రూపాయల 23 పైసలుగా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ 109 రూపాయల 82 పైసలయ్యింది, డీజిల్ ధర 95 రూపాయల 18 పైసలుగా ఉంది. ఇక చిత్తూరులో పెట్రోల్ 110 రూపాయల 83 పైసలుంటే, డీజిల్ 96 రూపాయల 86 పైసలుగా ఉంది.
.