దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత తగ్గిస్తున్నట్లు తెలియజేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయలు, లీటరు డీజిల్‌పై 10 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన సుంకాలపై 7 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను పరిశీలిద్దాం. రాజధాని ఢిల్లీలో నిన్న లీటర్ పెట్రోల్ 110 రూపాయలు దాటిన విషయం తెలిసిందే, అయితే, ఈరోజు రాజథాని వాసులకు ఊరటనిస్తూ ఇంధనం ధరలో భారీమార్పు కనిపిస్తోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలకు తగ్గింది. డీజిల్ ధర స్థిరంగా 98 రూపాయల 42 పైసలుగానే ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ నిన్నటిలా ఈ రోజు కూడా 114 రూపాయల 49 పైసలైతే… డీజిల్ ధర 107 రూపాయల 40 పైసలుగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఉన్న ఇంధనం ధరలను చూస్తే… కరీంనగర్‌లో పెట్రోల్ స్థిరంగా 114 రూపాయల 86 పైసలు ఉంటే.. డీజిల్ స్వల్పంగా పెరిగి 107 రూపాయల 73 పైసలైయ్యింది. నిజామాబాద్‌లోనూ నిన్నటి ధరలోనే పెట్రోల్ 116 రూపాయల 39 పైసలుగా ఉంటే, డీజిల్ కూడా స్థిరంగా 109 రూపాయల 15 పైసలుగా ఉంది. ఆదిలాబాద్‌లోనూ పెట్రోల్ ధరలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. లీటర్ పెట్రోల్ 116 రూపాయల 90 పైసలుగా ఉంటే, డీజిల్ 109 రూపాయల 63 పైసలుగా ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పెట్రోల్ అమాంతంగా పెరిగి షాకిచ్చిన విషయం తెలిసింది. అయితే, ఈ రోజు విజయవాడలో లీటర్ పెట్రోల్ నిన్నటి ధరకే ఆగి, 117 రూపాయలుగా ఉంది. డీజిల్ 109 రూపాయల 24 పైసలు. గుంటూరులో పెట్రోల్ 116 రూపాయల 86 పైసలుంది. డీజిల్ స్థిరంగా 109 రూపాయల 09 పైసలు ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ 115 రూపాయల 25పైసలు, డీజిల్ ధర 107 రూపాయల 58 పైసలుగా ఉంది. ఇక చిత్తూరులో పెట్రోల్ 118 రూపాయల 37 పైసలైతే, డీజిల్ 110 రూపాయల 47 పైసలుగా ఉంది.