తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు.
అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 466 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,71,946కి చేరింది. మృతుల సంఖ్య 3,960కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,953 యాక్టివ్ కేసులు ఉన్నాయి.