సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..

నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలోనే .. నానితో ఏకీభవిస్తున్నానంటూ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. దేనికి ఎంత ధర ఉండాలనే నిర్ణయం దాన్ని ఉత్పత్తి చేసే వారి చేతిలో ఉంటుందని, సినిమా టికెట్‌ ధర ఎంత ఉండాలనేది నిర్మాతే నిర్ణయించాలని ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ధరల తగ్గింపు వల్ల భవిష్యత్తులో ఎగ్జిబిషన్ వ్యవస్థ నాశనం అవుతుందని, ఈ విషయం ప్రభుత్వం గమనిస్తే మంచిదని చెప్పుకొచ్చారు.
అటు డైరక్టర్‌ దేవకట్టా సైతం స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికం అంటూ ఫైర్ అయ్యారు డైరెక్టర్ దేవకట్టా. డిమాండ్‌, సప్లై ఆధారంగా ఉత్పత్తయ్యే ఏ వస్తువుకూ ప్రభుత్వం రేట్లు నిర్ణయించలేదని, ఇది చట్టవిరుద్దమైన చర్య అంటూ రిప్లై ఇచ్చారు. ఇంత చిన్న వాస్తవాన్ని చాలామంది అర్థం చేససుకోలేకపోతున్నారు కాబట్టి ఈ నాశనాన్ని చూస్తూ ఆనందిద్దాం అంటూ దేవకట్టా ఘాటుగా స్పందించారు.
ఇక హీరో హీరో సందీప్ మరో అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వాన్ని డైరెక్టుగా విమర్శించకుండా.. మినిమం కామన్‌సెన్స్ అవసరం అంటూ దెప్పిపొడిచారు. ఏది ఒప్పో, ఏది తప్పో తెలుసుకోవాలని వాత పెట్టినట్టే ట్వీట్ చేశారు.

గతంలో సినిమా టికెట్ల విషయానికి సంబంధించి.. పవన్‌ కల్యాణ్‌ ఆరోజు ఎంత మొత్తుకున్నా మిగతా హీరోలెవరూ దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రేప్పొద్దున అందరికీ ఇదే సమస్య వస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ల సినిమాలకు సెగ తగులుతుండడంతో.. ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు.

Optimized by Optimole