పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో రామ్ ?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని ఓఇంటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజిగా ఉన్న రామ్.. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ని సొంతం చేసుకున్న రామ్.. వరుస ప్రాజెక్టులతో బిజిగా గడుపుతున్నారు.

ఇక 2006 లో దేవదాసు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ కి ఇచ్చిన రామ్.. డాన్సులు, ఫైట్స్‌, నటనతో యూత్ లో తనకంటూ క్రేజ్ సంపాందించుకున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో వారియర్ మూవీ నటిస్తున్నాడు.వచ్చే నెలలో మూవీ విడుదల కానుండటంతో.. సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. సినిమా విడుదల అనంతరం నిశ్చితార్ధానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వార్త వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తొోంది.

 

Optimized by Optimole