ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో టీంఇండియా బోణి కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 లో హార్దిక్ నేతృత్వంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. వర్షం పడటంతో ఎంపైర్లు మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఆజట్టులో టెక్టార్ (64*)టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్(1/16), చాహల్(1/11) పొదుపైన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
ఇక భారతజట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 9.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బ్యాటింగ్ లో దీపక్ హుడా (47*),ఇషాన్ కిషన్(26), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24) చెలరేగి ఆడారు. సిరీస్లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది