రాశి ప్రకారం దేవునికి తాంబూలం ఏ విధంగా సమర్పించాలి.
1. మేషం –
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.
2. వృషభం –
తమలపాకులో మిరియాలు ఉంచి
మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు.
సుఖసంతోషాలు చేకూరుతాయి.
3. మిథునం –
తమలపాకులో అరటిపండును ఉంచి
బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే..
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
4. కర్కాటకం-
తమలపాకులో దానిమ్మను ఉంచి
శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే
కష్టాలు తీరిపోతాయి.
5. సింహం –
తమలపాకులో అరటిపండును ఉంచి
గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.
6. కన్యారాశి –
తమలపాకులో మిరియాలు ఉంచి
గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే..
దుఃఖం దూరమవుతుంది.
7. తులారాశి-
తమలపాకులో లవంగంను ఉంచి
శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే..
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
8. వృశ్చికం-
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
9. ధనుస్సు –
తమలపాకులో కలకండను ఉంచి
గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
10. మకరం –
తమలపాకులో బెల్లంను ఉంచి
శనివారాల్లో కాళిమాతను పూజిస్తే..
కష్టాలు తీరిపోతాయి.
11. కుంభం –
తమలపాకులో నెయ్యిని ఉంచి
శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.
12. మీనం –
తమలపాకులో పంచదారను ఉంచి
ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
అలాగే ఈ తాంబూలాన్ని ఒక ముత్తైదువను పిలిచి, నిర్దేశించిన రోజున, ఆమెకు బొట్టుపెట్టి ఇవ్వవలెను.
అందరం భక్తితో ” అరుణాచల శివ ” అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం … ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు