ఓటమి భయంతోనే దీదీ ఆరోపణలు : అమిత్ షా

ఓటమి భయంతోనే దీదీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం తధ్యమని షా జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తృణమూల్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పోలింగ్ సమయంలో మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఓటమి భయం తోనే దీదీ తరచు అనవసర ఆరోపణలు చేస్తున్నారని షా చెప్పుకొచ్చారు.