చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా..

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ క‌కావిక‌లం అయ్యింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల‌కు గాను 13 సీట్ల‌ను వైసీపీ ఖాతాలో వేసుకుంది. ప‌చ్చ‌పార్టీ ఒక్క‌టంటే ఒక్క‌టే సీటు గెలుచుకుంది. ఆసీటు (కుప్పం) కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబుది కావ‌డం విశేషం.

ఇక తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేను బ‌ట్టి టీడీపీ ఎనిమిది(8), వైసీపీ ఐదు (5) సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంది. రెండు సీట్ల‌లో రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరి పోరు జ‌ర‌గ‌నుంది. ఒక‌వేళ టీడీపీ- జ‌న‌సేన పొత్తు కుదిరిన నేప‌థ్యంలో సైకిల్ పార్టీ పూర్తిగా డామినేట్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. టీడీపీ గెలుచుకునే సీట్లు చూసిన‌ట్ల‌యితే.. కుప్పం,ప‌ల‌మనేరు, మ‌ద‌న‌ప‌ల్లె,న‌గ‌రి, తిరుప‌తి, చిత్తూరు, శ్రీకాళ‌హ‌స్తిలో సైకిల్ పార్టీ గెలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. అధికార వైసీపీ.. పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె, చంద్ర‌గిరి,స‌త్య‌వేడు, పీలేరు లో వైసీపీ గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ర్వే తేలింది. పీలేరులో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole