సహనం నశిస్తే.. ఆటకు వీడ్కోలు పలుకుతా: ఆశ్విన్ రవిచంద్రన్
గెలుపోములు ను సమానం చూడడం మూలంగానే.. తాను అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి కారణమని భారత జట్టు స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. వివాదాలను తనకి ఇష్టముండదని.. ప్రతి సారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాని యాష్ స్పష్టం చేశాడు.
మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా గురించి రాసే కథనాలను పట్టించుకోను.. దేశంలో ఆడితే తెగ పొగిడేస్తారు.. నేను సాధారణ వ్యక్తిని.. నిరంతరం ఆటను ఆస్వాదిస్తాను అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడటం వలన జీవితానికి అర్థం దొరికింది. ఎవరు పొగిడిన, తిట్టిన పట్టించుకోనని సీనియర్ స్పిన్నర్ స్పష్టం చేశాడు. పోటీతత్వంమే తనలోని అత్యుత్తమ ప్రదర్శనకు కారణమని.. నేర్చుకోవడం ఆపేసినప్పుడు ఆట నుంచి తప్పుకుంటానని యాష్ స్పష్టం చేశాడు. పేర్కొన్నాడు. కొత్తగా నేర్చుకోవాలన్న తపనే తన కెరీర్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని యాష్ పేర్కొన్నాడు. కొత్తవి నేర్చుకోలేనపుడు.. సహనం నశించినపుడు ఆట నుంచి వీడ్కోలు తీసుకుంటానని ఆశ్విన్ వెల్లడించాడు.