పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు ‘ఆపరేషన్ శీష్ మహల్’ పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది.
న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు కేజ్రీవాల్ !
క్రేజీవాల్ మరమ్మత్తుల కోసం ఖర్చుపెట్టిన వివరాలు క్లుప్తంగా:
1. ఒక కోటి రూపాయలు కేవలం కర్టెన్స్ [కిటికీలకి తెరలు ] కోసం ఖర్చుపెట్టాడు కేజ్రీవాల్.
2. మొత్తం 23 కర్టెన్లు కోసం అంటూ ఖర్చు పెట్టగా కొన్ని కర్టెన్ల ధర ఒక్కో దానికి 8 లక్షలు ఖర్చు అయ్యింది.
3. మొత్తం 6 కార్పెట్ల కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.
4. 6 ఆల్మరాల కోసం 40 లక్షలు ఖర్చు పెట్టాడు.
5. ఇంట్లో మొత్తం మార్బుల్ రాయిని పరచడానికి అంటూ 3 కోట్లు ఖర్చు పెట్టాడు అదీ వియాత్నాం దేశం నుండి దిగుమతి చేసుకున్నాడు.
6. వియాత్నాం నుండి తెప్పించిన మార్బుల్ ని అతికించడానికి 21.6 లక్షల రూపాయలు రసాయనాల [కెమికల్స్ ] కోసం ఖర్చు పెట్టాడు.
7. రెండు వంట గదులు ఉన్నాయి వాటిని మాడ్యూలర్ కిచెన్ గా ఆధునీకరించడానికి అంటూ 69 లక్షలు ఖర్చుపెట్టాడు.
ఒక ముఖ్యమంత్రి నివాసానికి కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద వార్త అవుతుందా ?అస్సలు కానే కాదు !
కానీ తన ఎన్నికల వాగ్దానాలలో కేజ్రీవాల్ ప్రజలకి చెప్పింది ఏమిటి ? నేను అందరి ముఖ్యమంత్రుల లాగా ప్రభుత్వ అధికారిక బంగ్లా ల లో ఉండను. నేను సాదా సీదా అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఉంటూ పరిపాలన సాగిస్తాను!
పాపం ఢిల్లీ ప్రజలేమో RK లక్ష్మణ్ కార్టూన్ లో ఉండే ఒక సామాన్యుడి చిత్రాన్ని ఊహించుకొని మరీ వోట్లు వేసి గెలిపించారు.
మిగతా రాజకీయ పార్టీల విషయంలో అయితే ఎవరికీ అభ్యంతరం లేదు 45 కోట్లు తన అధికారిక నివాసానికి ఖర్చు పెట్టడంలో ! ఆ మాటకొస్తే గతం లోనూ ఇప్పుడూ చాలామంది ముఖ్యమంత్రులు 2 వేల కోట్ల రూపాయలు మరమ్మత్తుల కోసం అంటూ ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టిన ఘటనలు ఉన్నాయి.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు తన అధికార నివాసానికి ! అఖిలేష్ ఓడిపోగానే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయకపోగా అధికారులు నోటీసులు ఇచ్చినా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరకి సంవత్సరం తరువాత ఖాళీ చేశాడు!
అఖిలేష్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తూ ఇంట్లో ఉన్న ఇటాలియన్ టైల్స్ ని పేకిలించి మరీ తనతో తీసుకుపోయాడు. ఇక వాష్ రూమ్ లలో ఉండే వాష్ బెసిన్లు, కుళాయిలు కూడా పీక్కొని పోయాడు ఎందుకంటే అవి విదేశాలకి చెందినవి మరియు ఖరీదయినవి కాబట్టి. కానీ వాటి కోసం ఖర్చు పెట్టిన డబ్బు ప్రజలదే కదా ?
కానీ కేజ్రీవాల్ 45 కోట్లు ఖర్చుపెట్టిన సమయం సందర్భం మీదనే విమర్శలు వస్తున్నాయి !
2020 ల్ కోవిడ్ మహమ్మారి మన దేశాన్ని వణికిస్తున్న సమయంలో కేజ్రీవాల్ 45 కోట్లు ఖర్చుపెట్టాడు !
ఒక వైపు ఢిల్లీ హై కోర్టు లో కోవిడ్ నివారణ చర్యల మీద కేసు నడుస్తున్న సమయంలో కేజ్రీవాల్ తమ ప్రభుత్వం దగ్గర వాక్సిన్లు, ఆక్సిజెన్ సిలిండర్లు కొనడానికి తగినన్ని నిధులు లేవని కోర్టు అడిగిన ప్రశ్నలకి జవాబుగా చెప్పాడు. కానీ మరోవైపు తన అధికార నివాసం కోసం అంటూ 45 కోట్ల రూపాయాలని విడుదల చేయడాన్నే తప్పుపట్టాల్సివస్తుంది.
తాను చలి బారి నుండి రక్షించుకోవడానికి అంటూ కేవలం 350 రూపాయల మఫ్లర్ ని కొంటాను అని ప్రకటించిన కేజ్రీవాల్ తన అధికార నివాసంలోకి ఎవరూ తొంగి చూడలేరు అన్న ధీమా కావొచ్చు 45 కోట్లు ఖర్చు పెట్టడానికి అధికారిక ఉత్తర్వులు.. 45 కోట్లు దేనికోసం ఎంత ఖర్చు పెట్టారు అనే డాక్యుమెంట్లు దొరికిపోయాయి దీంతో నిజం బయట పడింది.
జైహింద్ ! జై భారత్ !